బాలీవుడ్ సెల‌బ్రిటీల తీరుపై కొరియోగ్రాఫ‌ర్ మండిపాటు

లాక్‌డౌన్ వ‌ల్ల ఇంట్లో జ‌రుగుతున్న ఈ చిన్న విష‌యాన్నైనా అభిమానుల‌తో పంచుకుంటున్నారు సెల‌బ్రిటీలు. అందులో భాగంగా ఇంటి ప‌నులు చేస్తూ, వంట చేస్తూ, షూటింగ్స్ లేవు క‌దా అని బ‌ద్ద‌కించ‌కుండా వ‌ర్క‌వుట్స్ చేస్తూ వీట‌న్నింటినీ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయిత ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితిలో వ‌ర్క‌వుట్ వీడియోలను సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయ‌డంపై ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ఫ‌రాఖాన్ మండిప‌డింది. జ‌నాల‌కు ఉప‌యోగ‌ప‌డే వీడియోల‌ను చేయ‌డం లేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె సెల‌బ్రిటీల‌ను ఉద్దేశిస్తూ.. "ముందుగా అంద‌రినీ క్ష‌మాప‌ణ కోరుతున్నా. వ్యాయామం చేయ‌డం అవ‌స‌ర‌మే. నేను ప్ర‌తిరోజు బాల్క‌నీలో ఒక గంట న‌డుస్తాను. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితి గురించి నేను ఆందోళ‌న చెందుతున్నాను. ఇది ప్ర‌పంచం జ‌రుపుకుంటున్న పార్టీ కాదు, ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి.