మైనర్‌ బాలికపై అత్యాచారం; 24 గంటల్లో నిందితుడు అరెస్టు

కృష్ణా : నూజివీడు పట్టణంలో బుధవారం మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ రవీంద్రబాబు నిందితుడిని పట్టుకునేందుకు ఓ ఐపీఎస్‌ అధికారితోపాటు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. శుక్రవారం నిందితుడు వెంకటేశ్వర రావును అతని ఇంటి వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పట్టణంలోని గాంధీనగర్‌ నివాసి అని, హోటల్‌లో సప్లైయర్‌గా పనిచేస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును చేధించిన రూరల్‌ ఎస్‌ఐ రంజిత్‌, ఇద్దరు కానిస్టేబుళ్లకు డీఎస్పీ శ్రీనివాసులు అవార్డులు అందజేశారు. (అర్థరాత్రి బాలికపై అత్యాచారం)